
పారిస్: ప్రమాదకర కోవిడ్ (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా కోరలు విప్పుతోంది. కోవిడ్‌కు చికిత్స అందించే వైద్యుడు మృతిచెందిన ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. తమ దేశంలో కోవిడ్‌కు చికిత్స అందించే వైద్యుడు మరణించిన తొలి కేసు ఇదేనని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఓలీవర్ వీరన్ వెల్లడించారు. ఫ్రాన్స్‌లోని ఓయిస్ డిపార్ట్‌మెంట్‌లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ప్రభుత్వం సరైన మాస్క్‌లు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వీరన్ స్పందిస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులకు సరైన సౌకర్యాలు కల్పించడం అనివార్యమని పేర్కొన్నారు. సరైన మాస్కులు ధరించిన వైద్యులు, నర్సులు కూడా కోవిడ్ బారిన పడ్డారని ఉదహరించారు. (కరోనా వైరస్ మరణాలు : 13 వేలు)
చదవండి: కరోనాకు మరో ముగ్గురి బలి