
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,684 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,749 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 718కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 17,610 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో 6,430 కరోనా కేసులు నమోదు కాగా, 283 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్‌లో 2,624, ఢిల్లీలో 2,376, రాజస్తాన్‌లో 1,964, మధ్యప్రదేశ్‌లో 1,699, తమిళనాడులో 1,683, ఉత్తరప్రదేశ్‌లో 1,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చదవండి : సూర్యాపేట అష్టదిగ్బంధనం