సూర్యాపేట అష్టదిగ్బంధనం

Government Taking Stringent Measures To Control Coronavirus In Suryapet - Sakshi

సీఎస్, డీజీపీ సూచనలతో అధికారుల పకడ్బందీ చర్యలు

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేటను గురువారం పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. జిల్లాలో కరోనా కట్టడికి ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి చేసిన సూచనలతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. జిల్లాలో నమోదైన 83 పాజిటివ్‌ కేసుల్లో 39 మార్కెట్‌ బజార్‌లోనివే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కంటైన్మెంట్‌ పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నతస్థాయి బృందం జిల్లా అధికారులను ఆదేశించింది.

దీంతో ఐజీ, ప్రత్యేకాధికారి, కలెక్టర్, ఎస్పీ మార్కెట్‌ బజార్‌ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 140 ఇళ్లలో నివాసం ఉంటున్న వారందరినీ సర్వే చేసి వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ప్రత్యేకాధికారి.. వైద్య శాఖను ఆదేశించారు. సూర్యాపేటలోనే 54 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పట్టణమంతా అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. సూర్యాపేటకు దారితీసే మార్గాలన్నీ మూసేశారు. చదవండి: సగానికిపైగా సేఫ్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top