భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు | Corona Death Toll Rises To 4706 In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

May 29 2020 9:34 AM | Updated on May 29 2020 11:14 AM

Corona Death Toll Rises To 4706 In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. (చదవండి : రేపటితో మోదీ పాలనకు ఏడాది)

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement