మరుగుదొడ్లకు నటుడి పేరు | Congress supporters name public toilet after Rishi Kapoor | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లకు నటుడి పేరు

May 24 2016 2:14 PM | Updated on Mar 18 2019 7:55 PM

అలహాబాద్ లో కాంగ్రెస్ నిరసన - Sakshi

అలహాబాద్ లో కాంగ్రెస్ నిరసన

గాంధీ కుటుంబంపై బాలీవుడ్ నటుడు రిషీకపూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన కొనసాగుతోంది.

అలహాబాద్/షోలాపూర్: గాంధీ కుటుంబంపై బాలీవుడ్ నటుడు రిషికపూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన కొనసాగుతోంది. బహిరంగ మరుగుదొడ్లకు రిషీ కపూర్ పేరు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కాంగ్రెస్ మద్దతుదారులు పబ్లిక్ టాయిలెట్ కు రిషికపూర్ పోస్టర్లు అతికించి ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్ సమీపంలోని సులభ్ కాంపెక్ల్ కు రిషికపూర్ పెట్టారు.

సోమవారం షోలాపూర్ యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేసింది. పట్టణంలోని మరుగుదొడ్లకు రిషీకపూర్ పేరు రాసి వినూత్న నిరసన తెలిపింది. ప్రాజెక్టులు, పథకాలకు గాంధీల పేరెందుకని రిషికపూర్ వ్యాఖ్యానించడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, మరుగుదొడ్లపై రాసిన రిషికపూర్ పేరును పోలీసులు చెరిపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement