ఇద్దరు ఎంపీలపై ఎంపీ పొన్నం కేసు నమోదు | Congress MP Ponnam Prabhakar hit by pepper spray files police complaint | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎంపీలపై ఎంపీ పొన్నం కేసు నమోదు

Feb 21 2014 9:58 PM | Updated on Sep 2 2017 3:57 AM

ఇద్దరు ఎంపీలపై ఎంపీ పొన్నం కేసు నమోదు

ఇద్దరు ఎంపీలపై ఎంపీ పొన్నం కేసు నమోదు

పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే, కత్తి పట్టుకుని సభలో గందరగోళం సృష్టించారనే ఘటనలో ఇద్దరు ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే, కత్తి పట్టుకుని సభలో గందరగోళం సృష్టించారనే ఘటనలో ఇద్దరు ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదు చేశారనే విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారి ధృవీకరించారు. అయితే పార్లమెంట్ లోపల జరిగిన ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చా అనే కోణంలో న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
ప్పెప్పర్ స్పే చేసిన లగడపాటి రాజగోపాల్, కత్తితో సభలోకి ప్రవేశించిన టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ పై గతవారం క్రిమినల్ కేసు నమోదు చేశామని వార్తా ఏజెన్సీకి ఎంపీ పొన్నం తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 325, 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement