కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..బీజేపీలోకి సోనియా అనుచరుడు!

Congress Leader And Sonia Gandhi Aide Tom Vadakkan Joins BJP - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ముఖ్య అనుచరుడు, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి టామ్‌ వడక్కన్‌ గురువారం బీజేపీలో చేరారు. కేం‍ద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకొన్నారు. అనంతరం వడక్కన్‌ మాట్లాడుతూ.. ‘కురువృద్ధ పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ ప్రస్తుతం నాయకులను వాడుకుని వదిలివేసే స్థాయికి దిగజారిందన్నారు. వంశ పారంపార్య పార్టీలో ఇతర నాయకులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బతకాల్సి ఉంటుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

చదవండి : కాంగ్రెస్‌ నేతగా సిగ్గుపడుతున్నా..

మోదీ విజన్‌ ఉన్న నాయకుడు..
‘పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు దిగితే అందుకు సాక్ష్యాలు కావాలంటూ.. సైనికులను అవమానించే తీరుగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. భారత సైన్యం విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. అందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నాను’ అని పార్టీ మారడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. ‘జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్‌లో కొనసాగలేకపోయాను. దేశంపై ఉన్న ప్రేమతోనే బీజేపీలో చేరాను. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ ఉన్న నాయకుడు. ఆయన నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది’ అని  వడక్కన్‌ మోదీపై ప్రశంసలు కురిపించారు. కాగా పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ స్థావరాలపై భారత వైమానిక దళం దాడులపై కాంగ్రెస్‌ పార్టీ తీరును నిరసిస్తూ.. ఆపార్టీ బిహార్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ రాజీనామా ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top