ఆర్టికల్‌ 370: తొలి ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌ | Congress boycott JK Block Development Council polls | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370: తొలి ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌

Oct 9 2019 4:38 PM | Updated on Oct 9 2019 7:58 PM

Congress boycott JK Block Development Council polls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎలక్షన్స్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ప్రధాన పార్టీల అధినేతలు గృహనిర్బంధంలో ఉండగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారని, కార్యకర్తలు ఎలా సిద్ధం కాగలరని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్‌ గులాం అహ్మద్ మీర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. తేదీలు ప్రకటించే ముందు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకే ఇలా హడావిడిగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. అక్టోబర్ 24న జమ్మూకశ్మీర్‌లో బీడీసీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement