సీజేఐ వేధింపులపై వాంగ్మూలమిచ్చిన మహిళ | Complainant In Harassment Case Against CJI Appears Before Inquiry Panel | Sakshi
Sakshi News home page

సీజేఐ వేధింపులపై వాంగ్మూలమిచ్చిన మహిళ

Apr 30 2019 9:29 AM | Updated on Apr 30 2019 9:31 AM

Complainant In Harassment Case Against CJI Appears Before Inquiry Panel - Sakshi

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ సోమవారం అంతర్గత విచారణ కమిటీ ముందు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని అయిన ఆమె ఈ విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆమె చేసిన ఆరోపణలపై జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ విచారణ చేపట్టింది.

జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ ఈ కమిటీలోని ఇతర సభ్యురాళ్లు. విచారణ సందర్భంగా బాధితురాలు ఒక్కరినే అనుమతించారని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆమె తరపు న్యాయవాది సమర్పించిన ఫిర్యాదును స్వీకరించేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. తదుపరి విచారణ మంగళవారం జరగనుందని తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement