‘స్వయంగా చిదంబరమే మార్చారు’ | Chidambaram himself changed | Sakshi
Sakshi News home page

‘స్వయంగా చిదంబరమే మార్చారు’

Mar 2 2016 1:49 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై మంగళవారం తెలిపారు.

న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై మంగళవారం తెలిపారు. ఐబీకి చెందిన కింది స్థాయి సిబ్బందిని పిలిపించి మార్పులు చేశారని, మంత్రే స్వయంగా చెప్పడంతో ఎవరూ మాట్లాడలేకపోయారని ఒక జాతీయ న్యూస్ చానల్‌తో చెప్పారు. ఐబీ అధికారులపై ఒత్తిడి తేవాలని తనను ఇబ్బంది పెట్టారంటూ నాటి హోంశాఖ కార్యాలయ అధికారి ఆర్వీఎస్ మణి చిదంబరంపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనమేరకు చిదంబరం ఈ పనిచేశారని కేంద్ర టెలికంమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో విమర్శించారు. ఇషత్‌ప్రై డేవిడ్ హెడ్లీ స్టేట్‌మెంట్‌పై బీజేపీ అసత్యాల్ని ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ తప్పుపట్టింది.  

 అఫిడవిట్ మార్పువెనుక రాజకీయ కారణాలు
 రాజకీయ కారణాలతోనే ఇష్రత్ అఫిడవిట్ మారిందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్.కె.సింగ్ అన్నారు. తన సహాచరుడు జావేద్ షేక్‌కు తీవ్ర వాదులతో సంబంధాలున్నాయని ఇషత్‌క్రు తెలుసని, అతనితో కలిసి రెండు చోట్లకు వెళ్లిందంటూ సింగ్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement