మూడు టన్నుల ఎర్రచందనం దుంగల స్వాధీనం | chennai Cops seize 3 tonnes of smuggled red sandalwood | Sakshi
Sakshi News home page

మూడు టన్నుల ఎర్రచందనం దుంగల స్వాధీనం

Apr 30 2015 7:24 PM | Updated on Sep 3 2017 1:10 AM

తమిళనాడులోని ఎంజీఆర్ నగర్ జాఫర్‌ఖాన్‌పేటలోని ఒక గిడ్డంగిలో ఎర్రచందనం దుంగలు దాచివుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది.

చెన్నై :  తమిళనాడులోని ఎంజీఆర్ నగర్ జాఫర్‌ఖాన్‌పేటలోని ఒక గిడ్డంగిలో ఎర్రచందనం దుంగలు దాచివుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీస్ సహాయ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో గిడ్డంగిపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కార్మికులు.. ఇది క్యారమ్బోర్డు తయారుచేసే కంపెనీ అని బదులిచ్చారు.

 

పోలీసులు గిడ్డంగిలో తనిఖీ చేయగా మూడు టన్నుల ఎర్రచందనం దుంగలు దొరికాయి. గిడ్డంగి యజమాని విశాల్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగలను ఆరునెలలుగా విదేశాలకు అక్రమరవాణా సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. క్యారమ్బోర్డు తదితర ఇంటి వస్తువులను ఎర్రచందనంతో తయారుచేసి విదేశాలకు చేరవేస్తున్నట్లు పట్టుబడిన నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఆ గిడ్డంగికి సీల్ వేసి, ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement