రేప్ కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు | Charge sheet for rape filed against Maharashtra IPS officer | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో ఐపీఎస్ అధికారిపై ఛార్జిషీటు

May 12 2015 8:11 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలో ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదైన 9 నెలల తర్వాత ఛార్జిషీటు దాఖలు చేశారు.

ముంబై: మహారాష్ట్రలో ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదైన 9 నెలల తర్వాత ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ రోజు ముంబై పోలీసులు డీఐజీ సునీల్ పరస్కార్పై మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీటు సమర్పించారు. 724 పేజీల నివేదిక అందజేసినట్టు క్రైం బ్రాంచ్ అధికారి ఒకరు చెప్పారు. మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. జూన్ 12న పరస్కార్ కోర్టుకు హాజరుకానున్నారు. 25 ఏళ్ల మోడల్ ఫిర్యాదు మేరకు గతేడాది జూలైలో పరస్కార్పైన కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement