చంద్రయాన్‌-2 జాబిల్లి చిత్రాలు విడుదల | Chandrayaan-2: ISRO releases pictures of moon surface | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-2 జాబిల్లి చిత్రాలు విడుదల

Oct 6 2019 8:08 AM | Updated on Oct 6 2019 3:51 PM

Chandrayaan-2: ISRO releases pictures of moon surface - Sakshi

చెన్నై: చంద్రయాన్‌-2లో భాగంగా జాబిల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్‌ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. జాబిల్లి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్‌ కెమెరా ద్వారా ఆర్బిటర్‌ తీసిన చిత్రాలు...బోగుస్లావ్‌స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్‌ తన చిత్రాల్లో బంధించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతో పాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయని ఇస్రో తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement