
న్యూఢిల్లీ: ఉల్లి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు ప్రకటించింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వల పరిమితిని 25 టన్నులు, 5 టన్నులకు కుదించింది. ఉల్లి సరఫరాను పెంచినప్పటికీ ధరలు గత కొద్ది వారాలుగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభకు వినియోగదారుల వ్యవహారాల శాఖ దన్వే రావ్ చెప్పారు.
హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఉల్లి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలని ఆదేశించామని తెలిపారు. దేశంలోని నగరాల్లో ఉల్లి గడ్డల ధర కిలో రూ.75 నుంచి రూ.100 వరకు ఉంది. సరాసరి ధర కిలో రూ.75 కాగా అత్యధికంగా పోర్ట్‌బ్లెయిర్‌లో రూ.140 వరకు పలుకుతోందని కేంద్రం తెలిపింది.