రాజీవ్‌ హంతకులను విడుదల చేయం : కేంద్రం

Center Says Can Not Released Rajiv Gandhi Killers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. హంతుకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తరుఫున అఫడవిట్‌ దాఖలు చేయాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్రం రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేసేది లేదని శుక్రవారం న్యాయస్థానానికి తెలిపింది. కాగా మాజీ ప్రధాని హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని రాజ్యాంగంలోని 161 అధికరణ ప్రకారం గవర్నర్‌ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

కాగా రాజీవ్‌ హంతుకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది వారిని విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1991 మే 21న ఆత్మహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు 1999లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వారిలో నళిని ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. 27 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష కింద వారిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top