అడ్డంగా బుక్కయిన ఐటీ అధికారి | CBI arrests income tax official for bribery | Sakshi
Sakshi News home page

అడ్డంగా బుక్కయిన ఐటీ అధికారి

Dec 11 2015 6:04 PM | Updated on Sep 3 2017 1:50 PM

5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి అడ్డంగా బుక్కయ్యాడు.

ముంబై: పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. ముంబైకి చెందిన ఐటీ అధికారి ఎం. జాగ్రన్ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సీబీఐకి దొరికారు. ముంబైలోని ఐటీ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

సదరు ఆఫీసర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో నిఘా పెట్టామని సీబీఐ అధికారులు తెలిపారు. పన్నుఎగవేసేందుకు గాను ఓ ప్రైవేటు కంపెనీ యజమాని నుంచి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారనే సమాచారంతో దాడులు జరిపినట్టు వెల్లడించారు. త్వరలోనే  నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు.

కాగా గతంలో ఇదే ఆఫీసులో రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఐటి కమీషనర్  దయా శంకర్ సీబీఐ అధికారులకు చిక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement