సముద్ర తీరాన సరదా; భయానక అనుభవం | Car Gets Stuck In Sand In Maharashtra Beach | Sakshi
Sakshi News home page

సముద్ర తీరాన సరదా; భయానక అనుభవం

Jun 10 2019 8:08 PM | Updated on Jun 10 2019 8:19 PM

Car Gets Stuck In Sand In Maharashtra Beach - Sakshi

సముద్ర తీరాన సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ బృందానికి భయానక అనుభవం ఎదురైంది. కారుతో చక్కర్లు కొడుతూ ఎంజాయ్‌ చేద్దామనుకున్న వారు ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు. చివరికి స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కొంతమంది వ్యక్తులు కారులో సముద్ర తీరానికి వచ్చారు. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ కారుతో వివిధ రకాల విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో కారు ఇసుకలో చిక్కుకుపోయింది. ఇంతలోనే భారీ అలలు వారిని ముంచెత్తాయి. దీంతో కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించినప్పటికీ అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో.. వారు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ కాసేపటి తర్వాత అలల ఉధృతి తగ్గడంతో సమీపంలో ఉన్న ట్రాక్టరు సహాయంతో కారును బయటికి తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement