కాల్సెంటర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం | Call centre employee gang-raped in Gurgaon | Sakshi
Sakshi News home page

కాల్సెంటర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

Oct 30 2013 2:43 PM | Updated on Sep 27 2018 2:34 PM

న్యూఢిల్లీ నిర్భయ' అత్యాచార సంఘటన అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.

న్యూఢిల్లీ నిర్భయ' అత్యాచార సంఘటన అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశరాజధాని శివారు ప్రాంతం గుర్గావ్లో మరో మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

కాల్సెంటర్లో పనిచేసే 19 ఏళ్ల ఉద్యోగినిపై బుధవారం తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. తన స్నేహితురాలి బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగొస్తుండగా, గుర్గావ్ 46వ సెక్టార్ వద్ద ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మెట్రో స్టేషన్ వద్ద దింపుతానని ప్రధాన నిందితుడు దినేశ్ అనే వ్యక్తి బాధితురాలిని తన బైక్పై తీసుకెళ్లాడు. మరో ఇద్దరితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దినేశ్ ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్ హైవేలో గల ఝార్సా గ్రామానికి చెందిన వ్యక్తని జాయింట్ పోలీస్ కమిషనర్ మహేశ్వర్ దయాల్ తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితుల్ని నవీన్, సత్యదేవ్గా గుర్తించినట్టు వెల్లడించారు. వీరు ముగ్గురి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement