జూన్ 4న పార్లమెంట్ తొలి సమావేశాలు | cabinet recommends parliament session from June 4-12th | Sakshi
Sakshi News home page

జూన్ 4న పార్లమెంట్ తొలి సమావేశాలు

May 29 2014 12:43 PM | Updated on Jul 29 2019 5:59 PM

జూన్ 4న పార్లమెంట్ తొలి సమావేశాలు - Sakshi

జూన్ 4న పార్లమెంట్ తొలి సమావేశాలు

16వ లోక్ సభ తొలి సమావేశాల తేదీని కేంద్ర మంత్రివర్గం ఖరారు చేసింది.

న్యూఢిల్లీ :  16వ లోక్ సభ తొలి సమావేశాల తేదీని కేంద్ర మంత్రివర్గం ఖరారు చేసింది.  జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం ఈ సమావేశాలు 12వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి రెండు రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 6వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కాగా ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ వ్యవహరించనున్నారు. జూన్ 9న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

గురువారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ... మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సిబ్బంది నియామకం విషయంలో బంధుప్రీతి చూపరాదని, మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement