
కోల్‌కతా: భార్యను, అత్తను అంతమొందించి తదననంతరం ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరుకు చెందిన చార్టడ్ అకౌంటెంట్ అమిత్ అగర్వాల్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమిత్ చనిపోయిన ప్రదేశంలో 67 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో తన భార్యను చంపడానికి ఆరు నెలలుగా అమిత్ రకరకాలుగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పాముతో కాటు వేయించడానికి ప్రయత్నించినట్లు, కారు యాక్సిడెంట్ చేయించాలనుకున్నట్టు, సుపారీ ఇచ్చి బిహార్ రౌడీలతో చంపించడానికి ప్రయత్నించినట్లు ఆ సూసైడ్ నోట్‌లో అమిత్ రాశాడు. (భార్యను చంపి.. ఆపై అత్తను చంపడానికి కోల్‌కతాకు..)
చివరికి ఇవేమి కాదని తానే భార్యను స్వయంగా హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్లు అమిత్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తరచు భార్యతో గొడవలు జరగడంతో భార్యతో విడాకులు తీసుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. గొడవలను మనసులో పెట్టుకున్న అమిత్ భార్య శిల్పి ధంధానియాను చంపి అనంతరం అతని అత్తమామల ఇంటికి వెళ్లి అత్తతో గొడవ పడి ఆమెను కూడా చంపాడు. మామ తప్పించుకొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికి అమిత్ కూడా తనని తాను కాల్చుకొని చనిపోయాడు. (పోంజి కుంభకోణం.. ఐఏఎస్ ఆత్మహత్య)