భార్య‌ను చంపి.. ఆపై అత్త కోసం కోల్‌కతాకు.. | Man Kills Wife And Flies To Kolkata To Kill Her Mother | Sakshi
Sakshi News home page

భార్య‌ను చంపి.. ఆపై అత్త‌ను చంపడానికి కోల్‌కతాకు..

Jun 23 2020 12:45 PM | Updated on Jun 23 2020 1:02 PM

Man Kills Wife And Flies To Kolkata To Kill Her Mother - Sakshi

కోల్‌క‌త్తా: బెంగుళూరులో నివ‌సిస్తున్న ఓ వ్య‌క్తి విమానంలో వెళ్లి త‌న అత్త‌‌ను హ‌త‌మార్చిన ఘ‌ట‌న కోల్‌క‌త్తాలో చోటుచేసుకుంది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం బెంగుళూరులో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ప‌నిచేస్తున్న అమిత్ అగ‌ర్వాల్‌కు భార్య శిల్పి ధంధానియా, ప‌దేళ్ల వ‌య‌‌సున్న కుమారుడు ఉన్నాడు. అయితే దంప‌తుల మ‌ధ్య నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకోవ‌డంతో ఇటీవ‌ల విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేగాక భార్య‌పై ఉన్న కోపంతో అత్త‌ను చంపేందుకు ప‌థ‌కం వేసుకున్న అమిత్‌ మంగ‌ళ‌వారం కోల్‌క‌త్తాకు చేరుకొని అత్త ల‌లిత‌‌తో గొడ‌వ‌కు దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన అమిత్ అత్త‌ను కాల్చి చంపాడు. (బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ యువకుల దుర్మరణం)

భ‌యంతో మామ సుభాష్ ధండానియా బ‌య‌ట‌కు ప‌రుగులు తీసి హంతుకుడిని ఇంట్లో ఉంచి తాళం వేశాడు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు తాళం తెరిచి చూశారు. ఇంట్లో అత్త‌తోపాటు చంపడానికి వచ్చిన అల్లుడు సైతం బెడ్ రూమ్‌లో మంచంపై ర‌క్త‌పు మ‌డుగుల మ‌ధ్య మ‌ర‌ణించి ఉండ‌టాన్ని పోలీసులు గుర్తించారు. కాగా అక్క‌డ పోలీసుల‌కు సూసైడ్ నోటు ల‌భించగా.. అందులో అత్త‌ను చంపే ముందు బెంగ‌ళూరులో త‌న భార్య‌ను అంతమొందిచిన‌ట్లు రాసుంది. విష‌యం తెలుసుకున్న‌ పోలీసులు బెంగ‌ళూరులోని  త‌న నివాసానికి వెళ్లి చూడ‌గా నిందితుడి భార్య కూడా అప్ప‌టికే మృత్యువాత ప‌డింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. (సీఐడీ అదుపులో టీడీపీ మాజీ మంత్రి అనుచరుడు..)

భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement