పోంజి కుంభకోణం.. ఐఏఎస్‌‌ ఆత్మహత్య

IAS Officer BM Vijay Shankar Deceased Who Commits IMA Ponzi Scam - Sakshi

బెంగళూరు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఎ పోంజి కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీఎం విజయ్‌ శంకర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.బెంగళూరులోని జయానగర్‌లో ఉన్న తన నివాసంలో విజయ శంకర్‌ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఎ పోంజి కుంభకోణంలో విజయ్‌ శంకర్‌ భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై 2019లో కుమారస్వామి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌ విజయ్‌ శంకర్‌ను అరెస్టు చేసింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా సీబీఐ ఈ కేసులో విజయ్‌ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను విచారించేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరింది.(పొట్టిగా ఉందని..మట్టుబెట్టాడు!)

2013లో పెద్ద మొత్తంలో రిటర్న్స్‌ను ఇస్తామని పేర్కొంటూ మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ పోంజి స్కీమ్‌కు తెరలేపాడు. వేలాదిమంది అమాయకుల నుంచి రూ. 4 వేల కోట్లను సేకరించాడు. దీనిపై అప్పట్లో ఆదాయపుపన్ను శాఖ, ఆర్‌బీఐ దృష్టిసారించింది. ఐఎంఏపై విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్‌బీఐ కోరింది. అందుకు నివేదిక తయారు చేసి రిపోర్ట్‌ సమర్పించవలసిందిగా ప్రభుత్వం విజయ్‌ శంకర్‌ను కోరింది.బెంగళూరు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎల్‌సీ నాగరాజ్‌తో కలిసి విజయ్‌ శంకర్‌ నివేదికను తయారు చేశాడు. ఈ క్రమంలోనే కేసును పక్కదారి పట్టించేందుకు విజయశంకర్‌, నాగరాజ్‌ రూ.1.5 కోట్లను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై లంచం ఆరోపణలు చేసి మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ దుబాయ్‌కి పారిపోయాడు. గతేడాది జులై 19న మన్సూర్‌ ఢిల్లీకి తిరిగి రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. కాగా ఖాన్‌తో పాటు ఐఎంఎలో ఉన్న ఏడుగురు డైరెక్టర్లను, ఓ కార్పొరేటర్‌తో పాటు పలువురిని అప్పట్లో సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. (టెక్కీని మోసగించిన కి'లేడీ')

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top