సరిహద్దులో దాడుల వీడియో విడుదల | BSF has released thermal images of a major infiltration bid by Pakistani terrorists | Sakshi
Sakshi News home page

సరిహద్దులో దాడుల వీడియో విడుదల

Oct 22 2016 3:08 PM | Updated on Jul 25 2018 1:49 PM

సరిహద్దులో దాడుల వీడియో విడుదల - Sakshi

సరిహద్దులో దాడుల వీడియో విడుదల

దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెప్పాయి.

జమ్మూకశ్మీర్‌: దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత బలగాలు దీటైన సమాధానం చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో బీఎస్‌ఎఫ్ దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. అయితే ఈ ఘటనకు ముందు రోజే కథువా జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన థర్మల్ ఇమేజెస్ను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై బాంబులు విసురుతూ, ఆ తర్వాత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి తిరిగి దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.

శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఇదే ప్రాంతంలో అంతకుముందు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. గుర్నామ్ సింగ్‌ను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికి త్స అందజేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement