కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి | Bridegroom died minutes before wedding in Bihar | Sakshi
Sakshi News home page

కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి

Jun 4 2017 5:54 PM | Updated on Jul 12 2019 3:15 PM

కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి - Sakshi

కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి

మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే బరాత్‌లో డాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు.

పాట్నా: మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే బరాత్‌లో డాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన బిహార్ లోని కైముర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... కైముర్ జిల్లా సరన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన దయా శంకర్‌పాండే కుమారుడు శశికాంత్‌పాండే (25)కి గత శుక్రవారం వివాహం నిశ్చయించారు.

బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపానికి తన గ్రామం నుంచి వివాహ వేదికకు ఊరేగింపుగా వెళ్తున్నారు. బరాత్ సందర్భంగా.. పెళ్లికొడుకును డాన్స్‌ చేయమని స్నేహితులు బలవంతంగా కారునుంచి దించి డాన్స్‌ చేయించారు. అందరితో కలిసి సంతోషంతో వరుడు శశికాంత్ ఫుల్లుగా డ్యాన్స్ చేశాడు. అంతలోనే గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకును పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో వరుడు శశికాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేయడం వల్లే గుండెపై ఒత్తిడి పెరిగి చనిపోయాడని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement