అన్న రాఖీ కట్టించుకోలేదని.. | Boy chooses to get rakhi tied later, shattered 12-year-old sister commits suicide | Sakshi
Sakshi News home page

అన్న రాఖీ కట్టించుకోలేదని..

Aug 19 2016 7:25 PM | Updated on Nov 6 2018 4:10 PM

అన్న రాఖీ కట్టించుకోలేదని.. - Sakshi

అన్న రాఖీ కట్టించుకోలేదని..

అన్న రాఖీ కట్టించుకోకుండా స్నేహితులతో కలసి ఆడుకోవడానికి వెళ్లాడనే కోపంతో ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.

రక్షాబంధన్ ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అన్న రాఖీ కట్టించుకోకుండా స్నేహితులతో కలసి ఆడుకోవడానికి వెళ్లాడనే కోపంతో ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని జాన్సీలో ఈ దారుణం జరిగింది.

గురువారం రక్షాబంధన్ సందర్భంగా కవిత (12) తన సోదరుడు అభిజీత్ (15)కు కట్టేందుకు రాఖీ తీసుకువచ్చింది. అయితే స్నేహితులతో కలసి ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నానని, మళ్లీ రాఖీ కట్టించుకుంటానని అభిజీత్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన కవిత గదిలోకి వెళ్లి తలుపులు బంధించి, ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టగా, లోపల కవిత మృతదేహం కనిపించింది. ఆ చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement