హింసాత్మక ఘటనపై చింతిస్తున్నా

Boris Johnson calls India-Pak to resolve Kashmir issue - Sakshi

మోదీతో ఫోన్‌లో బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌  

న్యూఢిల్లీ: లండన్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం బయట స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత ప్రధాని మోదీతో చెప్పారు. వారిద్దరు మంగళవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణపై ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పాకిస్తానీ సంఘాలు, కశ్మీర్, సిక్కు వేర్పాటువాద బృందాల సభ్యులు హైకమిషన్‌ ఎదుట ర్యాలీ చేశాయి. దీంతో భారత అనుకూల బృందాలూ ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై తాను చింతిస్తున్నట్లు జాన్సన్‌ మోదీతో అన్నారు. భారత హై కమిషన్, ఆ కార్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని బోరిస్‌ జాన్సన్‌ హామీనిచ్చారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top