బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత | Bombay High Court quashes complaint against Bollywood hero Govinda | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత

Nov 11 2013 2:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత - Sakshi

బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత

బాలీవుడ్ హీరో గోవిందాకు బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. గోవిందాపై ఐదేళ్ల క్రితం దాఖలైన కేసును న్యాయస్థానం సోమవారం కొట్టేసింది.

బాలీవుడ్ హీరో గోవిందాకు బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. గోవిందాపై ఐదేళ్ల క్రితం దాఖలైన కేసును న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. 2008లో గోవిందా తనను చెంపదెబ్బ కొట్టాడంటూ బాలీవుడ్ వెటరన్ సంతోష్ రాయ్ కేసు పెట్టారు.

రాయ్ మొదట ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. అయితే తనపై విచారణ జరగకుండా కేసు కొట్టివేయాలని గోవిందా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగింది. గోవిందాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేకపోవడంతో తాజాగా కేసును కొట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement