సీపీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు | Bomb threat to Kerala CPM headquarters | Sakshi
Sakshi News home page

సీపీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

Oct 9 2014 11:44 AM | Updated on Aug 13 2018 8:10 PM

కేరళలోని తిరువనంతపురంలో గల సీపీఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది.

కేరళలోని తిరువనంతపురంలో గల సీపీఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఎవరో వ్యక్తి ఫోన్ చేసి, ఆ కార్యాలయంలో బాంబులు పెట్టినట్లు బెదిరించాడు. అలా ఒకటి కాదు రెండు మూడు సార్లు కాల్ చేసి మరీ చెప్పాడు తెల్లవారుజామున 4.08 గంటల నుంచి 4.27 గంటల మధ్య ఇంటర్నెట్ ద్వారా ఈ ఫోన్లు చేశాడు.

తొలుత ఇది ఉత్తుత్త బెదిరింపే అనుకున్నా, ఒకటికి రెండు మూడు సార్లు బెదిరింపులు రావడంతో వెంటనే సీపీఎం వర్గాలు పోలీసులకు విషయం తెలిపాయి. దాంతో బాంబుస్క్వాడ్ను , కుట్రల వ్యతిరేక బృందాన్ని అక్కడకు పంపి తనిఖీలు చేయించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement