సీపీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
కేరళలోని తిరువనంతపురంలో గల సీపీఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఎవరో వ్యక్తి ఫోన్ చేసి, ఆ కార్యాలయంలో బాంబులు పెట్టినట్లు బెదిరించాడు. అలా ఒకటి కాదు రెండు మూడు సార్లు కాల్ చేసి మరీ చెప్పాడు తెల్లవారుజామున 4.08 గంటల నుంచి 4.27 గంటల మధ్య ఇంటర్నెట్ ద్వారా ఈ ఫోన్లు చేశాడు.
తొలుత ఇది ఉత్తుత్త బెదిరింపే అనుకున్నా, ఒకటికి రెండు మూడు సార్లు బెదిరింపులు రావడంతో వెంటనే సీపీఎం వర్గాలు పోలీసులకు విషయం తెలిపాయి. దాంతో బాంబుస్క్వాడ్ను , కుట్రల వ్యతిరేక బృందాన్ని అక్కడకు పంపి తనిఖీలు చేయించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు.