బీజేపీ గూటికి కుమార్ సాను | Bollywood singer Kumar Sanu joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ గూటికి కుమార్ సాను

Dec 3 2014 3:34 AM | Updated on Aug 15 2018 2:20 PM

బీజేపీ గూటికి కుమార్ సాను - Sakshi

బీజేపీ గూటికి కుమార్ సాను

ప్రముఖ నేపథ్య గాయకుడు కుమార్ సాను మంగళవారం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

న్యూఢిల్లీ: ప్రముఖ నేపథ్య గాయకుడు కుమార్ సాను మంగళవారం మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఓ దేశభక్తి గీతంలోని కొంత భాగాన్ని సాను పాడారు. తర్వాత మాట్లాడుతూ.. ‘నేను మోదీకి పెద్ద అభిమానిని. మోదీ మాత్రమే భారత్‌ను రక్షించగలరు. మనల్ని ముందుకు తీసుకుపోగలరు’ అని అన్నారు. పేదలకు సేవ చేయాలని భావించి బీజేపీలో చేరానని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంతో సేవ  చేయవచ్చన్నారు. ప్రస్తుతం బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్‌లో పార్టీ వల్ల మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement