కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ | Bollywood Actor Urmila Matondkar Joins Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ

Mar 27 2019 3:19 PM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood Actor Urmila Matondkar Joins Congress - Sakshi

కాంగ్రెస్‌ గూటికి బాలీవుడ్‌ నటి

ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లోకి వలసలు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్‌ నటి ఊర్మిళా మటోండ్కర్‌ బుధవారం కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఉత్తర ముంబై నుంచి ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌ మురళి దియోరా, పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, రణ్‌దీప్‌ సుర్జీవాలా సమక్షంలో రాహుల్‌ ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా తనను పార్టీలోకి సాదరం‍గా స్వాగతించిన రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. క్రియాశీల రాజకీయాల్లో తాను తొలి అడుగు వేస్తున్నానని, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌ల ఆలోచనా ధోరణి, స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ఊర్మిళ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా దేశానికి తనవంతు సేవలను అందిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement