మూగజీవాన్ని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే! | BJP MLA lathicharged a horse during the protest | Sakshi
Sakshi News home page

మూగజీవాన్ని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే!

Published Mon, Mar 14 2016 7:34 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

మూగజీవాన్ని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే! - Sakshi

డెహ్రాడూన్‌: ఓ ఎమ్మెల్యే విచక్షణ మరిచి రెచ్చిపోయాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తుండగా.. వారిని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు తమ ఆందోళన అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై కక్ష తీర్చుకున్నాడు. మూగజీవమన్న కనికరం లేకుండా లాఠీతో గుర్రాన్ని చితకబాదాడు. ఈ ఘటన సోమవారం డెహ్రాడూన్‌లో జరిగింది. హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

ఈ నిరసనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ గుర్రంపై తన ప్రతాపం చూపాడు. లాఠీతో నిర్దాక్షిణంగా మూగజీవాన్ని బాదాడు. తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించారు. చికిత్సలో భాగంగా తీవ్రగాయమైన గుర్రంకాలిని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. గుర్రాన్ని తీవ్రంగా గాయపర్చిన ఎమ్మెల్యే గణేష్ జోషిపై కేసు పెడతామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement