రజినీకాంత్‌ నాటకాలు ఆడుతున్నారు | BJP Leader Subramanian Swamy Comments On Rajinikanth | Sakshi
Sakshi News home page

రజినీకాంత్‌ నాటకాలు ఆడుతున్నారు

Jun 7 2019 7:58 PM | Updated on Jun 7 2019 8:00 PM

BJP Leader Subramanian Swamy Comments On Rajinikanth - Sakshi

రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీ నాటకాలు ఆడుతున్నారని...

సాక్షి, చెన్నై : సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌పై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి సూచనలు కనబడటం లేదని, రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలను ఆదరిస్తునపుడు రాజకీయ ప్రవేశంపై అయన ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. కాగా లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని గతంలో ఆయన సోదరుడు సత్యనారాయణరావు ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే, పార్టీ ప్రకటనపై నాన్చుడు ధోరణి అనుసరిస్తూ చివరకు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. తలైవా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయింది.

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సైతం ఆయన దూరంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని ఇదివరకే రజినీ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన మరోసారి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement