లద్దాఖ్‌, గుజరాత్‌కు బీజేపీ నూతన అధ్యక్షులు

BJP Appointed Presidents Jamyang Namgyal For Ladakh CR Patil For Gujarat - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు భారతీయ జనతా పార్టీ నూతన ​అధ్యక్షుడిని ప్రకటించింది. లోక్‌సభ ఎంపీ జమయంగ్‌ నంగ్యాల్‌ షెరింగ్‌ లద్దాఖ్‌ బీజేపీ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 35 ఏళ్ల నంగ్యాల్‌ లద్దాఖ్‌ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. పార్లమెంట్‌లో పై ప్రభావవంతంగా ప్రసంగించి హైలైట్‌ అయ్యారు. దీంతోపాటు గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఆర్‌ పాటిల్‌ను నియమిస్తున్నట్టు పార్టీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 65 ఏళ్ల సీఆర్‌ పాటిల్‌ గుజరాత్‌లోని నవ్‌సారి ఉంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని తన నియోజవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించిన పాటిల్‌కు మంచి గుర్తింపు లభించింది. ఆయన పనితనం చూసి ఏకంగా ప్రధాని మోదీయే తన నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి కార్యకలాపాలను పర్యవేక్షించాలని కోరారు. వరుసగా మూడోసారి పాటిల్‌ నవ్‌సరి నుంచి ఎంపీగా ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలవడం విశేషం.
(క్షణాల్లో 31.50 లక్షలు మాయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top