ఇండియా పేరు మార్పు: జోక్యం చేసుకోలేం | Bharat, Not India? Supreme Court Says Centre Can Decide | Sakshi
Sakshi News home page

'భార‌త్'‌గా ఇండియా: కేంద్రాన్ని ఆశ్ర‌యించండి

Jun 3 2020 8:18 PM | Updated on Jun 3 2020 8:29 PM

Bharat, Not India? Supreme Court Says Centre Can Decide - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా పేరును భార‌త్‌గా మార్చాల‌న్న పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కావాల‌నుకుంటే ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించింది. కాగా ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా పేరును భార‌త్ లేదా హిందుస్తాన్‌గా మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.‌ ఈ పేరు మార్పు వల్ల మన జాతీయతపై గర్వంగా అనుభూతి చెందవచ్చునని, పరాయిపాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇండియాను ఇప్ప‌టికే భార‌త్ అని పిలుస్తున్నార‌ని తెలిపింది. అయినా ఈ విష‌యంలో తాము క‌ల‌గ‌జేసుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది. (హైకోర్టు తీర్పును రద్దు చేయండి)

పేరు మార్పునకు సంబంధించి పిటిష‌న్ కాపీ మంత్రిత్వ శాఖ‌కు ఇవ్వాల‌ని సూచించింది. అప్పుడు ప్ర‌భుత్వమే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుందని పేర్కొంది. కాగా 'ఇండియా' అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్విస్తాయ‌న్నారు. అంతేకాక‌ దేశ చ‌రిత్ర‌లోనూ "భార‌త్ మాతాకీ జై" అనే నినాదాలున్నాయ‌న్నారు. ఇండియా అనే పేరును తొల‌గించ‌డం వ‌ల్ల విముక్తి సాధించిన‌వాళ్ల‌మ‌వుతాం అని వాదించారు. కాగా గ‌తంలోనూ ఇండియా పేరు మార్చాలంటూ 2016లో పిటిష‌న్ దాఖల‌వ‌గా సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది. (‘ఇండియా’ కాదు.. భారత్‌!)

Advertisement
 
Advertisement
Advertisement