బర్దన్ పరిస్థితి విషమం | Bardhan in serious condition | Sakshi
Sakshi News home page

బర్దన్ పరిస్థితి విషమం

Dec 10 2015 2:36 AM | Updated on Sep 3 2017 1:44 PM

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ (92) ఆరోగ్య పరిస్థితి విషమంగా

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ (92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారని పార్టీ నేత అతుల్ అంజన్ తెలిపారు. పక్షవాతానికి గురైన ఆయన్ను ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అయితే 24 గంటలుగా బర్దన్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement