breaking news
Bardhan
-
ఆదర్శప్రాయుడు బర్ధన్
సంతాపసభలో సీపీఐ నేతల నివాళి సాక్షి, హైదరాబాద్: సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ ప్రతి కమ్యూనిస్టుకు ఆదర్శప్రాయుడని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కొనియాడారు. ఆదివారం మగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బర్ధన్ సంతాపసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ అగ్ర నాయకుడు ఏబీ బర్ధన్ మరణంతో పార్టీ ఓ గొప్పనేతను కోల్పోయిందన్నారు. అన్ని వర్గాల సమస్యలపై ప్రతి పోరాటంలో క్రియాశీల పాత్ర పోషిం చిన బర్ధన్ మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ బర్ధన్ ఆశయాలను ముం దుకు తీసుకెళ్లడానికి ప్రతి కమ్యూనిస్టు కంకణబద్ధుడు కావాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, రాం నర్సింహారావు, ప్రభాకర్, బోస్, బాలమల్లేష్, సుధాకర్, పి. ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు. సీపీఎం సంతాపం కమ్యూనిస్టు అగ్రనేత బర్ధన్ మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. బర్ధన్ కార్మికోద్యమంలో, లెఫ్ట్ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు ఉత్తమ కమ్యూనిస్టుగా కొనసాగారని ఆపా ర్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, తెలంగాణ సాయు ద పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. వెంకటేశ్ తదితరులు సంతాపం తెలిపారు. -
బర్దన్ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ (92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఆయన ఐసీయూలోనే ఉన్నారని పార్టీ నేత అతుల్ అంజన్ తెలిపారు. పక్షవాతానికి గురైన ఆయన్ను ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అయితే 24 గంటలుగా బర్దన్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని తెలిపారు. -
లౌకిక శక్తుల ఐక్యత బాధ్యత లెఫ్ట్‌దే
సీపీఐ ఆవిర్భావం ఆకస్మిక పరిణామం కాదు: బర్ధన్ సాక్షి, హైదరాబాద్: దేశం అన్నివిధాలా సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతే కమ్యూనిస్టుల ముందున్న సవాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ చెప్పారు. ఈ శక్తులన్నింటినీ కలిపి ఉంచి వాటి స్థాయిని పెంచాల్సిన బాధ్యత వామపక్షాలదేనన్నారు. సీపీఐ 88వ వ్యవస్థాపక దినోత్సవం, కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అరుణపతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే రెండు నెలల కాలం చాలా కీలకమైందని, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. దేశంలో రెండు పార్టీల సిద్ధాంతాలే రాజ్యమేలుతున్నాయన్నారు. అధికార పక్షం ఓడితే ప్రతిపక్షం, ప్రతిపక్షం పోతే అధికారపక్షమే గద్దెనెక్కాలనుకుంటున్నాయని, వాస్తవానికి ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు లేవన్నారు.కాంగ్రెస్ పార్టీ అంతోఇంతో లౌకిక పార్టీగా చెప్పుకుంటుండగా ప్రతిపక్షం పచ్చిమతోన్మాద పార్టీ అని విమర్శించారు. ఆరు దశాబ్దాల స్వేచ్ఛా భారతంలోనూ సామాన్యుడి కష్టాలు కడతేరలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో దురదృష్టవశాత్తు చీలిక వచ్చినప్పటికీ అందరి లక్ష్యం సోషలిజమేనన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతే సమస్యలకు పరిష్కారమన్నారు. అయితే అది ఆషామాషీ కాదని, బూర్జువా పార్టీల మాదిరి ఈవేళ కలిసిపోయి,మరునాడు విడిపోవడం జరగదన్నారు. సైద్ధాంతిక, నిబద్ధత ప్రాతిపదికన కమ్యూనిస్టుల విలీనానికి సీపీఐ తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. 1925 డిసెంబర్ 26న చారిత్రక పరిణామాల మధ్య సీపీఐ పుట్టిందే గానీ ఆకస్మికంగా ఏర్పడలేదన్నారు. 1917 నాటి సోవియెట్ విప్లవం భారతీయ యువ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తమ పోరాటం ఫలితంగానే ఆనాటి కాంగ్రెస్ కూడా ‘పూర్ణ స్వరాజ్’ ఉద్యమాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సాయుధ పోరు వంటి అనేక చారిత్రక పోరాటాలను నడిపిన ఘనత కమ్యూనిస్టులదేనని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా తమ నుంచి మార్క్సిజాన్ని దూరం చేయలేరన్నారు. నిబద్ధత కమ్యూనిస్టులదే : నారాయణ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ,రాష్ట్రాన్ని వివిధ రకాల మాఫియాలు పాలిస్తున్నాయే తప్ప ముఖ్యమంత్రి కాదన్నారు.కమ్యూనిస్టులకు చట్టంపై నమ్మకం లేదనే వారే రాజకీయ వ్యవస్థల్ని, చట్టసభల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడేది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. బూర్జువా పార్టీల మాదిరి తాము పూటకో మాట మాట్లాడడం లేదని నారాయణ చెప్పారు. జేసీ బ్రదర్స్ వంటి ప్రైవేటు బస్సు మాఫియాను నియంత్రించే స్థాయి ముఖ్యమంత్రికి లేదన్నారు. నాయకులు పార్టీలు మారుతున్న తీరు ఇసుకతక్కెడ, పేడ తక్కెడగా ఉందని, వాళ్లలో వాళ్లే పార్టీలు మారుతూ ఎక్కడున్నా అధికారం తమకే దక్కేలా చూసుకుంటున్నారని ఆరోపించారు. సభలో పి.నరసింహ నేతృత్వంలో ప్రజా నాట్యమండలి కళాకారులు విప్లవగేయాలను ఆలపించారు. రెడ్‌గార్డ్స్ అరుణపతాకానికి వందనం చేశారు.