రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు.. | Bail For Rocky Yadav, accused of road rage murder, cancelled by supreme court | Sakshi
Sakshi News home page

రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..

Oct 28 2016 12:04 PM | Updated on Jul 18 2019 2:02 PM

రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు.. - Sakshi

రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..

టీనేజ్ యువకుడి హత్య కేసులో రాఖీ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది.

న్యూఢిల్లీ : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. టీనేజ్ యువకుడి హత్య కేసులో రాఖీ యాదవ్కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. దీంతో అతడు తిరిగి జైలుకు వెళ్లనున్నాడు.

కాగా రాఖీ యాదవ్ బెయిల్ మంజూరు కావడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ ఈ ఏడాది మే నెలలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత వారమే పట్నా హైకోర్టు రాఖీ యాదవ్కు బెయిల్ మంజూరు చేయటంతో మృతుడి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement