'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం' | Azam Khan strokes controversy, says Dawood was present during Modi-Nawaz meet in Lahore | Sakshi
Sakshi News home page

'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం'

Feb 6 2016 6:47 PM | Updated on Aug 24 2018 1:53 PM

'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం' - Sakshi

'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం'

సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం, ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ఒకే చోట కలుసుకున్నారని బాంబు పేల్చారు. ఇటీవల మోదీ, నవాజ్ షరీఫ్‌లు కలుసుకున్న సమయంలో దావూద్ కూడా అక్కడే ఉన్నాడని ఆజంఖాన్ ఆరోపించారు. 'దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మోదీని కాదని చెప్పమనండి' అంటూ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు.

అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. పొరుగు దేశం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన కానుకగా.. ఆయన మనవరాలు మెహరున్నిసా పెళ్లికి అనుకోని అతిథిగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా..  ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పాక్ గడ్డపై గత ఏడాది అడుగుపెట్టిన విషయం తెలిసిందే. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన భారత్‌కు వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement