పాక్‌లో దావూద్, మోదీ భేటీ: ఆజంఖాన్ | Azam Khan comments on PM modi | Sakshi
Sakshi News home page

పాక్‌లో దావూద్, మోదీ భేటీ: ఆజంఖాన్

Feb 7 2016 2:05 AM | Updated on Aug 15 2018 6:32 PM

ప్రధాని మోదీ గతేడాది డిసెంబర్ 25న పాకిస్తాన్‌లో జరిపిన ‘స్టాప్‌ఓవర్’లో ఆ దేశ ప్రధాని షరీఫ్‌తోపాటు..

లక్నో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గతేడాది డిసెంబర్ 25న పాకిస్తాన్‌లో జరిపిన ‘స్టాప్‌ఓవర్’లో ఆ దేశ ప్రధాని  షరీఫ్‌తోపాటు.. మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంనూ కలిశాడని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. ‘షరీఫ్ ఇంట్లో జరిగిన వ్యక్తిగత భేటీలో ఆయన తల్లి, కూతురు, మోదీతోపాటు దావూద్ కూడా ఉన్నారు. కావాలంటే ఇది అబద్ధమని మోదీని చెప్పమనండి. నా దగ్గర ఆధారాలున్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనవి జాతిని అవమానించే వ్యాఖ్యలని పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement