పదేళ్లలో సోనియా, రాహుల్‌ ఆస్తి ఎంత పెరిగింది? | Assets of Sonia, Rahul, Maneka and Mulayam Grew Manifold in 10 years: Report  | Sakshi
Sakshi News home page

పదేళ్లలో సోనియా, రాహుల్‌ ఆస్తి ఎంత పెరిగింది?

Mar 2 2019 8:32 PM | Updated on Mar 2 2019 8:40 PM

Assets of Sonia, Rahul, Maneka and Mulayam Grew Manifold in 10 years: Report  - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ, విధాన సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురి రాజకీయ వేత్తలు ఆస్తులు 13ఏళ్లలో 10 రెట్లు పుంజుకున్నాయి.  2019  సాధారణ ఎన్నికలు సమీపిస్తున‍్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ధన(బాహు)బలుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) శనివారం ప్రకటించింది.  వీటితోపాటు 2004​‍​‍, 2019 నాటికి ఆస్తులు బాగా వృద్ధి చెందిన పలువురు ఎంపీలు, ఎంఎల్‌ఏల వివరాలను కూడా వెల్లడించింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌, మరికొంత ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు.

2004-14 మధ్య కాలంలో యూపీఏ చైర్‌ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆస్తులు రూ. 7కోట్లు వృద్ది చెందాయి. అలాగే  కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ. రూ.30కోట్లు పెరిగింది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్  ఆస్తులు రూ.14కోట్లు పెరిగాయి. 2004 నుంచి 2014 మధ్యకాలంలో ఎస్‌పీ ఎంఎల్‌ఏ దుర్గా ప్రసాద్ యాదవ్ , ముక్తార్ అన్సారీ (ఇండిపెండెంట్) రూ. 8 కోట్లు పెరిగాయి.

శాసనసభ్యుల సగటు ఆదాయం 2007లో 1.2 కోట్లుగాను, 2012 రూ .3.87 కోట్లుగాను ఉంది. అదే 2017నాటికి వచ్చేసరికి రూ. 7.74 కోట్లకు అసాధారణంగా పెరిగిందని ఎడిఆర్ తెలిపింది. మొత్తం19,971 మంది అభ్యర్థులను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఇందులో 1,443 మంది ఎంపీలు, 38 శాతం మంది శాసనసభ్యులు తమపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్టుఅంగీకరించారు.  వీటిలో 328మంది శాసనసభ్యులు, ఎంపీలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని  ఎడీఆర్‌ నివేదించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement