కేజ్రీవాల్‌కు ఆదరణ పెరుగుతోంది: సర్వే∙

Arvind Kejriwal's stock soaring in Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై ప్రజాదరణ పెరుగుతున్నట్లు ‘ఇండియా టుడే’ చేపట్టిన పొలిటికల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజి సర్వేలో వెల్లడైంది. గత అక్టోబర్‌లో చేపట్టినప్పటి కంటే తాజా సర్వేలో 2 శాతం వరకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని తేలింది. సుమారు 49% మంది ప్రజలు కేజ్రీవాల్‌ పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు కేజ్రీవాల్‌ వైపే అత్యధికులు మొగ్గు చూపగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, మాజీ సీఎం షీలా దీక్షిత్‌ ఉన్నారు. ప్రధాని పదవికి మోదీకి 49% మంది, రాహుల్‌ 40% మంది అనుకూలంగా సమాధానమిచ్చారు. ఈ సర్వేను యాక్సిస్‌ మై ఇండియా సంస్థ 2018 డిసెంబర్‌ 27– 2019 జనవరి 3 మధ్య చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top