మిలటరీ కేంద్రాలకు ఐటీ హంగులు | Army to modernise 2,000 military stations | Sakshi
Sakshi News home page

మిలటరీ కేంద్రాలకు ఐటీ హంగులు

Oct 22 2017 7:22 PM | Updated on Oct 22 2017 7:24 PM

Army to modernise 2,000 military stations

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 2 వేల మిలటరీ కేంద్రాలను స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆధునీకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 58 మిలటరీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు.

సరిహద్దుల్లో కీలకంగా ఉండే మిలటరీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంటర్‌నెట్‌ నెట్‌వర్క్‌ను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులు కల్పన, రహదారులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement