బోరుబావి నోట్లోకి మరో బాలుడు | Sakshi
Sakshi News home page

బోరుబావి నోట్లోకి మరో బాలుడు

Published Mon, Apr 14 2014 4:54 PM

Another boy falls into open borewell

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కుంతలపురిలో రెండున్నరేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడిని కాపాడేందుకు అధికారులు ముమ్మరం చేశారు.


రెండున్నరేళ్ల ఆ బాలుడు తండ్రి వెనకే నడుస్తూ వెళ్తూండగా, ఉపయోగంలో లేని తెరిచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు. అసలు బాలుడు ఎంత లోతులో ఉన్నాడన్నది నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి పొక్లేయినర్లను, ఇతర యంత్రాలను రప్పించారు.


తమిళనాడులో ఈ నెల ఇది రెండో బోరుబావి సంఘటన. ఏప్రిల్ 6 న విల్లుపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరులో ఒక బాలిక పడిపోయింది. మూడేళ్ల ఆ బాలిక చనిపోయింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూండటంతో తమిళనాడు హైకోర్టు ఉపయోగంలో లేని బోరుబావులను మూసేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement