చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు.. | anna hajare wish to aravind kejriwal | Sakshi
Sakshi News home page

చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు..

Feb 10 2015 11:14 AM | Updated on Mar 29 2019 9:31 PM

చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు.. - Sakshi

చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు..

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే శుభాకాంక్షలు తెలిపారు. మొదటసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఉద్యమాలను కూడా మర్చిపోవద్దని హజారే పేర్కొన్నారు.

ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నా హజారే వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నల్లధనాన్ని తీసుకొస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ఇది నరేంద్ర మోదీ ఓటమి అని హజారే అన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. 62 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement