భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!! | Angry Bihar man bobbitises himself | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి... కోసేసుకున్నాడు!!

Sep 12 2014 1:17 PM | Updated on Jul 18 2019 2:11 PM

భార్యతో తీవ్రంగా గొడవపడిన ఓ బీహారీ.. పట్టలేని కోపం వచ్చి పదునైన చాకు తీసుకుని తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు.

భార్యతో తీవ్రంగా గొడవపడిన ఓ బీహారీ.. పట్టలేని కోపం వచ్చి పదునైన చాకు తీసుకుని తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. బీహార్లోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి ఇద్దరు కూతుళ్లున్నారు. కొడుకు మాత్రం పుట్టలేదు. దాంతో అదే విషయం మీద అతడికి తన భార్యతో ఎప్పుడూ గొడవలు అవుతుండేవి.

గురువారం కూడా ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ కోపంలోనే అతడు తన అంగాన్ని కోసేసుకున్నట్లు వాళ్ల బంధువు ఒకరు పోలీసులకు తెలిపారు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి గల్ఫ్లోని ఖతార్ దేశంలో ఉద్యోగం చేసుకుంటాడు. నెల రోజుల సెలవు పెట్టి ఇటీవలే బీహార్లోని తన స్వస్థలానికి వచ్చాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement