అండమాన్‌లో భూకంపం

Andaman Islands Earthquake Hits 2019 - Sakshi

పోర్టుబ్లేయర్‌ : అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపంలో బుధవారం ఉదయం 1.51 గంటలో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అండమాన్‌ ద్వీపంలో 10 కిలోమీటర్ల లోతున ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. దీంతోపాటు చెన్నై, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. బంగాళఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు.

అయితే ఈ నెల 10న ఇండియా-మయన్మార్‌ సరిహద్దులో, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతంలో కూడా భూకంపం సంభంవించిన సంగతి తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ మీద 5.2గా నమోదయ్యింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top