అమృత పిటిషన్‌పై ప్రభుత్వానికి నోటీసులు

Amrutha's claims of being Jayalalithaa's kin: Why can't a DNA test be done asks HC - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత కూతురిగా తనను ప్రకటించాలంటూ అమృత అనే మహిళ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ అంశంపై స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు తాము జయ బంధువులమనీ, అమృత ఆమె కూతురేనని బెంగళూరుకు చెందిన ఎల్‌ఎస్‌ లలిత, రంజనీ రవీంద్రనాథ్‌ కోర్టుకు తెలిపారు. అమృత జయ కూతురో కాదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని వారు కోరారు. తండ్రి నిర్ధారణ కంటే ముందుగా జయలలితే తన తల్లి అని అమృత నిరూపించుకోవాల్సి ఉందని వారి తరఫు న్యాయవాది బదులిచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top