చివరికి సాధించారు : అమృత ఫడ్నవీస్‌ | Amruta Fadnavis Congratulates Devendra Fadnavis Ajit Pawar | Sakshi
Sakshi News home page

చివరికి సాధించారు : అమృత ఫడ్నవీస్‌

Nov 23 2019 5:15 PM | Updated on Nov 23 2019 6:34 PM

 Amruta Fadnavis Congratulates Devendra Fadnavis Ajit Pawar - Sakshi

మహారాష్ట్ర సీఎంగా రెండో​సారి ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన భార్య అమృత ఫడ్నవీస్‌ అభినందనలు తెలిపారు.

ముంబై : తన భర్త, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లను ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అమృత ఫడ్నవీస్‌ అభినందించారు. ‘దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు అభినందనలు..మీరు సాధించార’ని అమృత ఫడ్నవీస్‌ శనివారం ట్వీట్‌ చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో అనూహ్యంగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తోడ్పాటుతో దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈనెల 30లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి సమయం ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement