రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి | Rs 4 crores 108kg silver Ganesha idol at the Jalna pandal in maharashtra | Sakshi
Sakshi News home page

రూ.4 కోట్లు : 108 కిలోల వెండి గణపతి

Sep 16 2026 5:02 PM | Updated on Sep 16 2026 5:28 PM

Rs 4 crores 108kg silver Ganesha idol at the Jalna pandal in maharashtra

ముంబై:  దేశమంతటా లక్షలాది విగ్రహాలతో గణేశ ఉత్సవాలు సోమవారం నుంచి సందడిగా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని జల్నా నగరంలో, బంగారంతో పూత పూసిన, సుమారు రూ. 4 కోట్ల విలువైన 108 కిలోల వెండి గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.  ఈ విగ్రహాన్ని ఏకంగా 108 కిలోల వెండితో తయారు చేయడంతోపాటు ఆపై బంగారు పూత పూయడం విశేషం. ఈ  విగ్రహం విలువ రూ.4 కోట్లుంటుందని  అనోఖా గణేశ్‌ మండల్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ భారతీయ చెప్పారు.

‘వాస్తవానికి విగ్రహానిన 2023లో 107 కిలోల వెండితో తయారు చేయించారు.  అయితే ఈ నాలుగేళ్లలో వెండి విలువ బాగా పెరిగింది. ఇటీవల ఈ విగ్రహానికి 50 తులాల బంగారంతో పూత వేయించడంతో దీని  ప్రస్తుత బరువు 108 కిలోలకు  చేరింది. ఈ ఏడాది వేడుకల్లో భక్తులు, కుటుంబాల కోసం అలంకరించిన శకటాలు, ఇతర ఆకర్షణలు ఉంటాయని మండల్ అధ్యక్షుడు రితేష్ మిశ్రా తెలిపారు. 

ఇదీ చదవండి: ‘క్వీన్‌ ఫిషర్‌’ యూట్యూబర్‌ జీవితం విషాదాంతం

విగ్రహాన్ని ఏడాది పొడవునా సురక్షిత మైన ప్రదేశంలో ఉంచుతారని, గణేష్ ఉత్సవాల సమయంలో దానిని బయటకు తీసి మండప ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారని తెలిపారు. 12 రోజుల పండుగ గణేష్ చతుర్థి  ఉత్సవాలు సోమవారం  ప్రారంభమైనాయి.

ఇదీ చదవండి: ఒరాకిల్‌ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement